రైతు రాజ్యమే లక్ష్యం

రైతు రాజ్యమే లక్ష్యం

ఖమ్మం: రైతు రాజ్యమే తమ లక్ష్యమని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేశారు.  వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 88 వ రోజు వైరా నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా షర్మిల ట్రాక్టర్ నడిపి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదని ఆరోపించారు. అందుకే తాను వైఎస్ఆర్టీపీని స్థాపించానని చెప్పారు. ఉద్యోగాల కోసం రాష్ట్రం సాధించుకుంటే.. నోటిఫికేషన్లు ఇవ్వకుండా  ఆత్మహత్యలు మిగిల్చాడని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. సున్నా వడ్డీ రుణాలు, నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాలు, రుణమాఫీ ఏమయ్యాయని ప్రశ్నించారు. 13 ఏళ్ల తర్వాత కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు పెట్టుకున్నారనడానికే అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడిన జనసందోహం నిదర్శమన్నారు. మహా నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మరణం లేదన్నారు. తాము అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ పాలనను తిరిగి తీసుకొస్తామని, వ్యవసాయాన్ని పండుగ చేస్తామని భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తల కోసం...

రాష్ట్రంలో ఇయ్యాల,రేపు వర్షాలు

నా బైక్నే ఆపుతావా అంటూ ట్రాఫిక్ పోలీసులపై దాడి