కాళ్లు పట్టుకున్నారు.. గల్లా పట్టుకోకముందే కొనాలె

V6 Velugu Posted on Nov 24, 2021

హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో ఏర్పడిన జాప్యంపై వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల సీరియస్ అయ్యారు. ఢిల్లీ రాజకీయాలు చేసే కేసీఆర్ కు ఇక్కడి రైతుల చావులు, ఆత్మహత్యలు కనిపించడం లేదని దుయ్యబట్టారు. ఆఖరి గింజ వరకు కొంటానని కేసీఆర్.. ఇప్పటికైనా డ్రామాలు పక్కన పెట్టాలన్నారు. కాళ్లు పట్టుకుంటున్న రైతులు.. గల్లా పట్టుకోకముందే వారి ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు. 

‘ఢిల్లీ రాజకీయాలు చేసే దొరగారికి ఇక్కడి రైతుల చావులు, నేతన్నల ఆత్మహత్యలు కనిపించడం లేదు. పెట్టిన పెట్టుబడి రాక, పండిన పంట కళ్ల ముందు కొట్టుకుపోతుంటే, అప్పులు తీరక గుండెలు ఆగిపోతుంటే కేసీఆర్ కు మాత్రం కనిపించడం లేదు. దొరా.. పంటలు కొనండని గుండెలు ఆగేలా మొత్తుకొంటున్నా.. కేసీఆర్ కు మాత్రం చెవిటోని ముందు శంఖం ఊదినట్టే ఉంది. ఆఖరి గింజ వరకూ కొంటానన్న దొర, ఇప్పటికైనా మీ డ్రామాలు పక్కన పెట్టి.. కాళ్లు పట్టుకొంటున్న రైతులు, గల్లా పట్టుకోకముందే ధాన్యాన్ని తక్షణమే కొనాలని డిమాండ్ చేస్తున్నాం’ అని షర్మిల ట్వీట్ చేశారు.  

 

Tagged Telangana, Central government, CM KCR, YS Sharmila, farmer suicides, Delhi tour, Paddy Sales, farmer issues

Latest Videos

Subscribe Now

More News