టీ20లలోకి రీ ఎంట్రీ ఇస్తానంటున్న యువరాజ్!

టీ20లలోకి రీ ఎంట్రీ ఇస్తానంటున్న యువరాజ్!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆల్‌ రౌండర్‌‌‌‌ యువరాజ్‌‌‌‌ సింగ్‌ .. రిటైర్మెంట్‌ను పక్కనబెట్టి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకునేందుకు పర్మిషన్‌‌‌‌ ఇవ్వాలని బీసీసీఐకి లేఖ రాశాడు. పంజాబ్‌‌‌‌ క్రికెట్‌‌కు సాయం చేయాలని అసోసియేషన్‌‌‌‌ సెక్రటరీ పునీత్‌‌‌‌ బాలి తీసుకొచ్చిన ఆఫర్‌‌‌‌కు యువీ అంగీకరించాడు. దీంతో టీ20 ఫార్మాట్‌ లో పంజాబ్‌‌‌‌ స్టేట్‌ టీమ్‌‌‌‌కు ఆడాలని డిసైడ్‌‌‌‌ అయ్యాడు. గతేడాది జూన్‌‌‌‌లో యువరాజ్‌‌‌‌ అన్ని ఫార్మాట్లకు గుడ్‌‌‌‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ‘ఆరంభంలో బాలి విజ్ఞప్తిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ డొమెస్టిక్‌‌‌‌ లెవెల్‌ లో ఆడే సత్తా నాకు ఇంకా ఉంది. బీసీసీఐ పర్మిషన్‌‌‌‌ ఇస్తే.. పంజాబ్‌‌‌‌కు ఆడేందుకు రెడీగా ఉన్నా. నా బ్యాటింగ్​ టచ్​ కూడా బాగుంది. అందుకే ఈ ఆఫర్‌‌‌‌కు ఓకే చెప్పా’ అని యువీ పేర్కొన్నాడు. గత కొన్ని నెలలుగా పంజాబ్‌‌‌‌ క్రికెటర్లు శుభ్‌ మన్‌‌‌‌ గిల్‌, అభిషేక్‌‌‌‌ వర్మ, ప్రభ్​సిమ్రాన్ సింగ్‌ , అన్మోల్‌ ప్రీత్‌‌‌‌ సింగ్​కు యువీ నెట్స్ లో మార్గనిర్దేశం చేస్తున్నాడు.

For More News..

ఎంట్రీ లెవెల్ కార్లకు జోష్

రోజుకు ఏపీ వాటా 2,250  క్యూసెక్కులే

వీడియో: రోహిత్ శర్మ సిక్స్ కొడితే.. స్టేడియం ముందు వెళ్తున్న బస్‌పై పడింది