గ్లోబల్ టీ20లో యువీ కళ్లు చెదిరే సిక్సర్లు

గ్లోబల్ టీ20లో యువీ కళ్లు చెదిరే సిక్సర్లు

ముంబై : క్రికెటర్ యువరాజ్ సింగ్ చెలరేగుతున్నాడు. అసలుసిసలైన ఆటను మళ్లీ చూపిస్తూ ఫ్యాన్స్ లో జోష్ పెంచుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌ లో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇంటర్నేషనల్  కెరీర్‌ కు గుడ్ బై చెప్పిన తర్వాత ఎంటర్‌ టైన్‌మెంట్‌ క్రికెట్‌ ను ఆస్వాదిస్తున్నాడు.  బ్రాంప్టన్‌ వూల్వ్స్‌తో జరిగిన మ్యాచ్‌ లో టొరంటో నేషనల్స్‌ కెప్టెన్ యువీ 22 బాల్స్ లోనే 51 రన్స్ సాధించాడు.

ఈజీగా 3 బౌండరీలు, 5 కళ్లు చెదిరే సిక్సర్లు బాదేశాడు. 222 టార్గెట్ ఉన్నప్పటికీ అతడి ఆట చూసి ప్రత్యర్థి ఆటగాళ్ల గుండెల్లో దడ పుట్టింది. అతడికికి తోడుగా హెన్రిచ్‌ క్లాసెన్‌ 26 బంతుల్లో 35 పరుగులు చేశాడు. వీరిద్దరూ 44 బంతుల్లో 75 పరుగులు జోడించారు. అయితే వెంటవెంటనే వీరిద్దరూ ఔట్‌ కావడంతో ఆ జట్టు 11 రన్స్ తేడాతో ఓటమి పాలైంది.

IPLలో తాను పరుగులు చేయకపోవడంతో ఫ్యాన్స్ ఆనందంగా కనిపించలేదన్న యువీ..  భారీ షాట్ల కోసం వెయిట్ చేశారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న గ్లోబల్ టీ20లో ఫ్యాన్స్ కు మంచి కిక్కు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు యువరాజ్.