
ముంబై: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లతో విజృంభించిన స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ రాజస్తాన్ రాయల్స్‌ను గెలిపించాడు. హ్యాట్రిక్ సాధించిన తర్వాత సెలబ్రేషన్స్‌లో భాగంగా గ్రౌండ్‌లో కూర్చొని ఇచ్చిన పోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోజు వెనకున్న ముచ్చటను మ్యాచ్ అనంతరం చహల్ వెల్లడించాడు. 2019 వరల్డ్‌కప్ టైమ్‌లో మీమ్‌గా మారిన తన పోజునే మళ్లీ రిపీట్ చేశానని చెప్పాడు. ఆ టోర్నీలో ఓ మ్యాచ్‌లో ఫైనల్ ఎలెవన్‌లో లేని చహల్.. ప్లేయర్లకు డ్రింక్స్ అందించాడు. ఈ క్రమంలో బౌండ్రీ లైన్ అవతల రెండు కాళ్లు చాపి తాపీగా కూర్చున్న అతని ఫొటోపై చాలా మీమ్స్ వచ్చాయి. ఇక, కేకేఆర్‌తో మ్యాచ్‌లో గూగ్లీలతో రాణా, వెంకటేశ్ అయ్యర్‌ను ఔట్ చేసిన చహల్.. లెగ్ బ్రేక్‌తో కమిన్స్ వికెట్ పడగొట్టి హ్యాట్రిక్ సాధించాడు. వాస్తవానికి ఈ బాల్ కూడా గూగ్లీ వేయాలనుకున్నప్పటికీ.. చాన్స్ తీసుకోవద్దని లెగ్ బ్రేక్ వేశానని చహల్ చెప్పాడు.