TTD ఛైర్మన్‌గా రేపు వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం

TTD ఛైర్మన్‌గా రేపు వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం

వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ పాలక మండలి చైర్మన్ గా నియమిస్తూ, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియామక ఫైల్ పై సంతకం చేశారు. రేపు ఉదయం 11 గంటలకు తిరుమల శ్రీవారి సమక్షంలో సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో పాలకమండలి ఏర్పడుతుందని, సభ్యులుగా ఎవరిని నియమించాలన్న విషయాన్ని జగన్ స్వయంగా పరిశీలిస్తున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి.