SAREGAMAPA 16 Auditions: సింగర్స్‌కు అద్భుత అవకాశం..జీ తెలుగు సరిగమప సీజన్​ 16 ఆడిషన్స్​..డోంట్ మిస్

SAREGAMAPA 16 Auditions: సింగర్స్‌కు అద్భుత అవకాశం..జీ తెలుగు సరిగమప సీజన్​ 16 ఆడిషన్స్​..డోంట్ మిస్

మీ వాయిస్ ని ప్రపంచానికి వినిపించే బంగారు అవకాశం వచ్చేసింది. పాట మీ ప్రాణం అయితే, మీ టాలెంట్ ని రుజువు చేస్కో డానికి, నెక్స్ట్ సింగింగ్ సూపర్ స్టార్ గా నిలవడానికి, ఈ అద్భుతమైన అవకాశం మీ కోసం!

ప్రముఖ జీ తెలుగు అందిస్తోన్న సరిగమప 16 ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ ఆడిషన్స్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ షో ద్వారా ఎంతోమంది  సింగర్స్‌ తమ కలలను సాకారం చేసుకున్నారు. సినిమాలలోనూ, ఆడియో ఆల్బమ్స్ ద్వారా తమ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నారు.  

 ఇప్పటికీ  సక్సెస్ఫుల్గా 15 సీజన్లు కంప్లీట్ చేసుకున్న జీ తెలుగు ‘సరిగమప సీజన్‌ 16‌ లో సింగర్స్గా మారాలనుకుంటున్నారా..ఇదిగో గొప్ప అవకాశం మీ కోసం. జీ తెలుగు సరిగమప నెక్స్ట్ సీజన్​ కోసం తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో ఆడిషన్స్​ నిర్వహిస్తోంది. ప్రతిభను ప్రోత్సహిస్తూ మట్టిలోని మాణిక్యాలను వెలికితీసేందుకు ఈ ఆదివారం (ఆగస్ట్ 25) హైదరాబాద్​లో ఆడిషన్స్​నిర్వహిస్తోంది. ఇందుకోసం 15 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల సింగర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు. 

ఆడిషన్స్ వివరాల విషయానికి వస్తే..సరిగమప సీజన్​16 ఆడిషన్స్​ఉదయం 9:00 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి.ఈ ఆడిషన్స్ హైదరాబాద్​లోని హిందూ మహిళా జూనియర్ కళాశాల, హిందూ పబ్లిక్​ స్కూల్​ దగ్గర, గోకుల్​ థియేటర్​ ఎదురుగా, సనత్​ నగర్​లో​ జరగనున్నాయి. అలాగే మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి 9154670067 నెంబర్​కు కాల్ చేసి సంప్రదించవచ్చు.

అంతేకాకుండా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఆగస్టు 30 వరకు డిజిటల్ ఆడిషన్స్ ద్వారా కూడా ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.ఎవరైనా ఈ మెయిల్ ద్వారా పంపాలనుకుంటే..పాట పాడిన తమ వీడియోలను 9154670067 నెంబర్​కి వాట్సాప్ లేదా ztsaregamapa@zee.com ఈమెయిల్ ద్వారా కూడా పంపవచ్చు. గుర్తించబడని టాలెంట్స్..ఇదిగో గొప్ప అవకాశం వదులుకోకండి. మీ సిగ్నేచర్ గొంతులను వినిపించేయండి.