యూఎస్ ను సాయం కోరిన జెలెన్ స్కీ

యూఎస్ ను సాయం కోరిన జెలెన్ స్కీ

300ల రోజలుగా రష్యా దాడులను అడ్డుకుంటూ.. తమ సైన్యం దేశాన్ని కాపాడుతుందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ తెలిపారు. రష్యా తమపై ఎప్పటికీ ఆధిపత్యం సాధించలేదన్నారు. యుద్ధభూమిలో గెలవడానికి తమకు మరిన్ని ఆయుధాలు అవసరమన్నారు. రష్యాతో యుద్ధం తర్వాత మొదటిసారి విదేశీ టూర్ లో భాగంగా జెలెన్ స్కీ అమెరికాలో పర్యటించారు. 

యూఎస్ ప్రెసిడెంట్ జోబైడెన్ తో భేటీ అయ్యారు.తమకు సాయం చేయాలని స్కీ అభ్యర్థించారు. 180 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయం అందజేసేందుకు యూఎస్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.  అనంతరం జెలెన్ స్కీ యూఎస్ కాంగ్రెస్ లో మాట్లాడారు.