భద్రతా మండలిలో రష్యా వీటో అధికారం తొలగించాలి

భద్రతా మండలిలో రష్యా వీటో అధికారం తొలగించాలి

యూఎన్: భద్రతా మండలిలో రష్యాకు ఉన్న వీటో అధికారాన్ని తొలగించాలని ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​ జెలెన్​ స్కీ కోరారు. స్పెషల్​ వార్​ ట్రిబ్యునల్​ ఏర్పాటుచేసి.. చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. జెలెన్​స్కీ సందేశంతో కూడిన ప్రిరికార్డింగ్‌‌‌‌ వీడియోను యూఎన్​ జనరల్​ అసెంబ్లీలో ప్లే చేశారు. ఉక్రెయిన్​పై రష్యా యుద్ధ నేరాలకు పాల్పడిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు.

రష్యా దాడులను తిప్పికొట్టేందుకు అన్ని దేశాలు తమకు సాయంచేయాలని కోరారు. ప్రపంచం ఎదుట రష్యాను శిక్షించాలన్నారు. దాడుల్లో ఉక్రెయిన్​ తీవ్రంగా నష్టపోయిందని, దేశాన్ని పునర్​ నిర్మించుకునేందుకు నిధులు అవసరమని వివరించారు. దీనికి కాంపెన్సేషన్​ నిధి ఏర్పాటు చేసి ఆదుకోవాలన్నారు. జెలెన్​స్కీ వీడియో ప్లే అవుతున్నంత సేపు సభ్యులందరూ నిలబడి చప్పట్లు కొడుతూ ఉన్నారు.