లడఖ్‌లో జీరో ఉష్ణోగ్రతలు.. విధుల్లోనే సైన్యం

లడఖ్‌లో జీరో ఉష్ణోగ్రతలు.. విధుల్లోనే సైన్యం

తూర్పు లఢఖ్‌లోని 1,597 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ(LAC) వెంట ఉష్ణ్రోగ్రతలు జీరోకు చేరుకున్నాయి. గాలిలో తేమ తీవ్రత పెరిగింది. లడఖ్ లోని గౌలెట్‌ బేగ్‌ ఓల్టి సెక్టార్‌లో మంచు తుఫాన్‌ కురిసింది. అయినప్పటికీ.. భారత ఆర్మీ అన్ని ప్రాంతాల్లోనూ తమ స్థానాల్లో ఒక అంగుళం మార్పు కూడా చేయలేదు. ఇటీవల భారత్‌, చైనాలు వాస్తవాధీన రేఖ వెంబడి సైనికుల ఉపసంహరణ ప్రతిపాదనను అమలు చేయనున్నట్లు తెలిసినప్పటికీ.. భారత సైనిక స్థావరాల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రతికూల వాతావరణం కారణంగా భారత దళాలు గుడారాలు, ఇగ్లూలలో ఉంటున్నారు. LAC దగ్గర కంటైనర్లలో నివసిస్తున్నారు. LAC  అంతటా ప్రత్యేక దళాలను మోహరించడంతో పాటు బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ అన్ని ఎత్తైన పర్వతాలపైన కూడా సైన్యాలను మోహరించింది. మార్సిమికాలా, చాంగ్‌ లా, ఖార్డంగ్‌ లా లో కూడా సైన్యం తమ విధులను నిర్వహిస్తోంది. సైనిక కమాండర్ల స్థాయిలో చర్చలు ఇంకా కొనసాగుతున్నందున దశల వారీగా సైన్యాల బేస్‌మెంట్‌లో మార్పులు తీసుకోవడం అనేది జరగదన్నారు ఉన్నత సైనిక కమాండర్‌.