యూఎస్‌‌, యూకే కాదు..ఇక ఇండియా

యూఎస్‌‌, యూకే కాదు..ఇక ఇండియా

న్యూఢిల్లీ: మంచి చదువులు, జాబ్స్‌‌ కోసం విదేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్న వారు ప్రస్తుత ఇండియాను ఒకసారి చూడాలని జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్‌‌ పేర్కొన్నారు. యూఎస్‌‌లోని ఫ్యాన్సీ కాలేజిల్లో చదువులు పూర్తి చేసి, అక్కడే జాబ్స్ చేస్తూ, తిరిగి ఇండియాకు వచ్చేయాలని అనుకుంటున్న తన ఫ్రండ్స్‌‌ను ఉద్దేశిస్తూ ఆయనొక ట్వీట్ చేశారు.‘రెసిషన్ వచ్చే అవకాశం ఏయే దేశాల్లో ఎంత ఉంది’, ‘దేశాల జీడీపీ గ్రోత్ రేటు అంచనాలు’ ...ఈ రెండింటిని వివరించే రెండు గ్రాఫ్‌‌లను ఆయన పంచుకున్నారు. మొదటి గ్రాఫ్‌‌ను బ్లూమ్‌‌బర్గ్‌‌ డేటా నుంచి డెవలప్ చేయగా, రెండో గ్రాఫ్‌‌ను ఐఎంఎఫ్‌‌ వరల్డ్‌‌ ఎకనమిక్ అవుట్‌‌లుక్‌‌ ద్వారా రెడీ చేశారు. 

రెసిషన్‌‌..

రెసిషన్‌‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో 75 శాతం ప్రొబబిలిటీతో యూకే, 65 శాతం ప్రొబబిలిటీతో యూఎస్‌‌ టాప్‌‌లో ఉన్నాయి. ఇండియాలో రెసిషన్ రాదని ఈ గ్రాఫ్​ పేర్కొంది. కెనడాలో రెసిషన్‌‌ రావడానికి 60 శాతం ప్రొబబిలిటీ ఉందని, జర్మనీలో కూడా రెసిషన్ వచ్చే అవకాశాలు 60‌‌‌‌ శాతం ఉన్నాయని  ఈ గ్రాఫ్‌‌ వెల్లడించింది. మరో గ్రాఫ్​లో దేశాల జీడీపీ డేటాను నిఖిల్ కామత్ పంచుకున్నారు. 5.9 శాతం గ్రోత్‌‌ రేట్‌‌ (యాన్యువల్‌‌) తో ఇండియా ఈ గ్రాఫ్​లో టాప్‌‌లో ఉంది. 1.6 శాతం గ్రోత్ రేటుతో యూఎస్‌‌, 1.5 శాతం గ్రోత్ రేటుతో కెనడా దిగువన ఉన్నాయి. యూకే, జర్మనీ నెగెటివ్ గ్రోత్‌‌ నమోదు చేస్తాయని ఈ గ్రాఫ్ అంచనావేసింది. ‘ఇండియా కీలక స్థానంలో ఉందని అన్ని ఇండికేటర్లు సూచిస్తున్నాయి. ఎంటర్‌‌‌‌ప్రెనూర్ల దృష్టితో చూస్తే, ఇక్కడే అవకాశాలు ఉన్నాయి’ అని నిఖిల్ కామత్ ట్వీట్ చేశారు.