V6 News

Women’s T20 World Cup 2024: జింబాబ్వేలో మహిళల టీ20 ప్రపంచ కప్..?

Women’s T20 World Cup 2024: జింబాబ్వేలో మహిళల టీ20 ప్రపంచ కప్..?

భద్రత మరియు భద్రతా కారణాల దృష్ట్యా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ను ఎక్కడ జరుగుతుందనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. భారత్ లో నిర్వహించాలని బీసీసీఐను ఐసీసీ కోరగా దీనికి సెక్రటరీ జైషా సున్నితంగా తిరస్కరించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ మెగా ఈవెంట్ ను నిర్వహించడానికి జింబాబ్వే ఆసక్తి చూపిస్తున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సైతం రేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. 

బీసీసీఐ సెక్రటరీ జైషా ఈ ఈవెంట్‌కు భారత్ లో నిర్వహించడం కుదరదని చెప్పడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆగస్టు 20న జరిగే ఐసీసీ బోర్డు సమావేశం అనంతరం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జింబాబ్వే మహిళల జట్టు ఇప్పటివరకు ఏ క్రికెట్ ప్రపంచకప్‌లో ఆడలేదు. గత 21 ఏళ్లలో జింబాబ్వేలో ఎప్పుడూ క్రికెట్ ప్రపంచకప్ జరగలేదు. జింబాబ్వే చివరిసారిగా 2003లో కెన్యా, దక్షిణాఫ్రికాతో కలిసి మెన్స్ వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చింది. 

10 జట్లు.. 18 రోజులు

పది జట్లు తలపడే ఈ టోర్నీ అక్టోబర్ 3-20 వరకు జరగాల్సి ఉంది. పాల్గొనే 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌-ఏలో భారత్‌, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, క్వాలిఫయర్‌ 1 ఉండగా..  ఆతిథ్య బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, క్వాలిఫయర్‌ 2 గ్రూప్‌-బి లో ఉన్నాయి. రెండు గ్రూపుల నుంచి టాప్‌-2 జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్‌ 20న ఫైనల్‌ జరగనుంది.