జైళ్లల్లో చోటులేదని 4 వేల మంది రిలీజ్..

జైళ్లల్లో చోటులేదని 4 వేల మంది రిలీజ్..

హరారే: దేశంలోని జైళ్లల్లో చోటు సరిపోకపోవడంతో జింబాబ్వే ప్రభుత్వం  కొంతమంది ఖైదీలను విడిచిపెట్టనుంది. ఇందులో భాగంగా తీసుకున్న చర్యలతో సుమారు 4వేల మంది ఖైదీలకు రాష్ట్రపతి క్షమాభిక్ష లభించింది. దాంతో శక్రవారం హరారేలోని సెంట్రల్ జైలు, చికురుబి జైలులో శిక్ష అనుభవిస్తున్న 800 మంది ఖైదీలు విడుదలయి ఇంటికి వెళ్లిపోయారు. జింబాబ్వేలోని జైళ్లు 17 వేల మంది ఖైదీలకు మాత్రమే సరిపోతాయి. అయితే, ప్రస్తుతం 20 వేల కంటే ఎక్కువ మంది ఖైదీలు ఉన్నారు. దీనివల్ల ఖైదీలందరికి ఆహారం సరిపోవడం లేదు. వాళ్ల ఆరోగ్య సంరక్షణ అధికారులకు తలకు మించిన భారంగా తయారైంది. దాంతో చిన్న నేరాలకు పాల్పడి శిక్షల్లో మూడింట ఒక వంతు పూర్తి చేసిన మహిళలను రిలీజ్ చేయాలని  అధికారులు నిర్ణయించారు..