IND vs ZIM 2024: గిల్, గైక్వాడ్ మెరుపులు.. జింబాబ్వే టార్గెట్ 183

IND vs ZIM 2024: గిల్, గైక్వాడ్ మెరుపులు.. జింబాబ్వే టార్గెట్ 183

హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20 లో భారత బ్యాటర్లు మరోసారి తమ జోరు చూపించారు. రెండో టీ20 లో ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత ఆటగాళ్లు.. మూడో టీ20 లో పర్వాలేదనిపించారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ శుభమాన్ గిల్(49 బంతుల్లో 66: 3 సిక్సులు, 7 ఫోర్లు) రుతురాజ్ గైక్వాడ్(28 బంతుల్లో 49: 4 ఫోర్లు, 3 సిక్సులు) యశస్వి జైస్వాల్ (36) మెరుపులు మెరిపించారు. 

ఈ సిరీస్ లో భారత్ వరుసగా మూడో సారి టాస్ గెలిచింది. గిల్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. యశస్వి జైస్వాల్ తో గిల్ ఓపెనింగ్ దిగాడు. ప్రారంభం నుంచే ఈ జోడీ జింబాబ్వే బౌలర్లపై ఎదురు దాడికి దిగింది. తొలి ఓవర్లో 14.. రెండో ఓవర్లో 15 పరుగులు పిండుకున్న టీమిండియా పవర్ ప్లే లో వికెట్ నష్టపోకుండా 55 పరుగులు రాబట్టింది. 8 ఓవర్లో జైస్వాల్ భారీ షాట్ కు ప్రయత్నించి 36 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో మ్యాచ్ లో సెంచరీ హీరో అభిషేక్ శర్మ  10 పరుగులే చేసి ఔటయ్యాడు. 

ALSO READ | Martin Guptill: ఔట్ చేశానని ఇప్పటికీ తిడుతున్నారు.. ధోనీ రనౌట్‌పై మార్టిన్ గుప్టిల్

ఈ దశలో గిల్ కు జత కలిసిన గైక్వాడ్ భారత స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. మొదట ఆచితూచి ఆడినా క్రమంగా బ్యాట్ ఝళిపించారు. ఈ క్రమంలో గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని ఇన్నింగ్స్ 18 ఓవర్లో ఔటయ్యాడు. గైక్వాడ్ 49 పరుగులు చేసి చివరి ఓవర్లో వెనుదిరిగాడు. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రాజా, ముజురుభాని చెరో రెండు వికెట్లు పడగొట్టారు.