జింబాబ్వే అధ్యక్షుడిగా ఎమ్మెర్సన్ మ్నంగాగ్వా

జింబాబ్వే అధ్యక్షుడిగా ఎమ్మెర్సన్ మ్నంగాగ్వా

జింబాబ్వే అధ్యక్షుడిగా ఎమ్మెర్సన్ మ్నంగాగ్వా మరోసారి ఎన్నికయ్యారు.  2023 ఆగస్టు 27 శనివారం రాత్రి వెలువడిన ఫలితాల్లో ఆయన పార్టీ  ZANU-PF  52.6 శాతం ఓట్లను సాధించినట్లు జింబాబ్వే ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నెల్సన్ చమీసా పార్టీకి 44 శాతం ఓట్లు సాధించారు. కాగా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని విపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.  కాగా 1980లో శ్వేతజాతీయుల మైనారిటీ పాలన నుండి జింబాబ్వే స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి ZANU-PF 43 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంది.