ZP ఛైర్మన్ ను సస్పెండ్ చేయాలంటూ ZPTC ల ఆందోళన

ZP ఛైర్మన్ ను సస్పెండ్ చేయాలంటూ ZPTC ల ఆందోళన

కర్నూలు జిల్లాలో జిల్లా పరిషత్ సర్వ సభ సమావేశం వాడీవేడిగా జరిగింది. జిల్లా పరిషత్ ఆస్తుల ఆక్రమణపై శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చర్చ ప్రారంభించిచారు. ఈ చర్చలో జిల్లా పరిషత్ ఆవరణలో ఉన్న చైర్మన్ బంగాళాను  జడ్పి చైర్మెన్ మల్లెల రాజశేఖర్ ఓ హోటల్ కు లీజుకు ఇవ్వడాన్ని పరిషత్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. జడ్పీటీసీల అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఛైర్మన్ వ్యవహరించారని, వెంటనే అతన్ని  సస్పెండ్ చేయాలంటూ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.

ఇందుకు సంబంధించి చైర్మన్ మల్లల రాజశేఖర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఛైర్మన్ బంగ్లాను ఓ ప్రైవేట్ హోటల్ కు లీజుకివ్వడంపై ఎమ్మెల్యేలు, ఎంపీటిసి, జడ్పిటిసి సభ్యులు  రాజశేఖర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తక్షణమే హోటల్ లీజ్ కు సంభందించిన తీర్మానంపై కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు  మొత్తం వ్యవహారంలో బాధ్యులైన అధికారులు, సహా ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామాని కలెక్టర్ గణేష్ వీర పాండ్యన్ స్పష్టం చేశారు.