హైదరాబాద్, వెలుగు: అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ లైఫ్ సైన్సెస్ సంస్థ వివిధ రకాల క్యాన్సర్ల చికిత్స కోసం టిస్టా బ్రాండ్ పేరుతో సరికొత్త బయోసిమిలర్ మందును విడుదల చేసింది. నివోలుమాబ్ అనే డ్రగ్‌కు సమానంగా పనిచేసే ఈ మందును ప్రపంచంలోనే మొదటిసారిగా భారత్‌లో ప్రవేశపెట్టింది.
దీని 100 ఎంజీ ధర రూ.28,950 కాగా 40 ఎంజీ ధర రూ.13,950 గా నిర్ణయించింది. సాధారణ మందులతో పోలిస్తే ఇది కేవలం నాలుగో వంతు ధరకే లభిస్తుంది. దీనివల్ల సుమారు ఐదు లక్షల మంది రోగులకు నాణ్యమైన చికిత్స అందుతుందని జైడస్ ఎండీ శార్విల్ పి పటేల్ తెలిపారు.
ఈ వార్తతో బీఎస్ఈలో కంపెనీ షేరు ధర గురువారం 0.87 శాతం పెరిగి రూ.883.75 వద్ద ముగిసింది.
