రాష్ట్రపతిగా నియమించండంటూ పర్యావరణవేత్త పిటిషన్

రాష్ట్రపతిగా నియమించండంటూ పర్యావరణవేత్త పిటిషన్

దేశానికి రాష్ట్రపతి కావాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. అయితే ఆ కలను నెరవేర్చుకోవడం కోసం ఓ పర్యావరణవేత్త పెద్ద సాహసమే చేశాడు. తనను రాష్ట్రపతిగా నియమించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు... విచారణకు స్వీకరించేందుకు తిరస్కరించింది. మరోసారి ఇలాంటి పిటిషన్‌ ధర్మాసనం ముందుకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ పిటిషన్ దాఖలు చేసిన పర్యావరణవేత్త పేరు కిశోర్‌ జగన్నాథ్‌ సావంత్‌.

గత మూడు సార్లుగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నా అనుమతించడం లేదని కిశోర్ జగన్నాథ్ తెలిపారు. అయితే నేరుగా రాష్ట్రపతిగా నియమించాలని 2004 నుంచి తనకు రాష్ట్రపతికిచ్చే జీతభత్యాలు చెల్లించాలని పిటిషనర్‌ కోరారు. ఈ పిటిషన్ పై సుప్రీం తాజాగా స్పందించింది. నిరర్థకమైన అభ్యర్థనలతో న్యాయ వ్యవస్థను దుర్వినియోగపరచ వద్దని సూచించింది. దాంతో పాటు పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు స్పష్టం చేసింది.