నమామి గంగా తరహాలో మూసీ నదిని క్లీన్ చేయాలే 

నమామి గంగా తరహాలో మూసీ నదిని క్లీన్ చేయాలే 
  • లోక్​సభలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: కాలుష్యంతో నిండిన మూసీ నది కారణంగా చుట్టుపక్కల ఉంటున్న దాదాపు కోటి మంది ఊపిరితిత్తులు, తదితర సమస్యలతో అనారోగ్యం పాలయ్యారని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం లోక్ సభ జీరో అవర్ లో మూసీ ప్రక్షాళన అంశాన్ని లేవనెత్తారు. హైదరాబాద్​లోని డ్రైనేజీ నీళ్లు మూసీలో కలుస్తున్నాయని, ఫార్మా ఇండస్ట్రీలు శుద్ధి చేయని నీళ్లను ఈ నదిలోకే వదులుతున్నాయని చెప్పారు.రాష్ట్ర సర్కారు నీళ్ల శుద్ధి ప్లాంట్లు పెట్టట్లేదన్నారు. నమామి గంగా తరహాలో మూసీ ప్రక్షాళన చేపట్టాలన్నారు. కాగా, కేంద్రమంత్రి పీయూష్ గోయల్​ను కోమటి రెడ్డి కలిశారు. తెలంగాణలో ఎన్​హెచ్ డీపీ కింద హ్యాండ్​లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని కోరారు.