స్క్రాప్ పేరుతో.. రూ.6.30 కోట్ల మోసం

స్క్రాప్ పేరుతో.. రూ.6.30 కోట్ల మోసం

జూబ్లీహిల్స్ , వెలుగు: స్క్రాప్ సరఫరా పేరుతో ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ భారీ మోసానికి పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. కర్నాటకలోని గౌరీబిదనూర్ తాలూకాలో ఉన్న తమ ఫ్యాక్టరీ యార్డులో 9,147 మెట్రిక్ టన్నుల స్క్రాప్ ఉందని నమ్మించి, ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఎల్ షుగర్స్ (తుంగభద్ర) లిమిటెడ్, మెస్సర్స్ జెనిష్ రెక్లమేషన్ ప్రతినిధులు తనను మోసం చేసినట్లు బాధితుడు వనోడియా ప్రవీణ్‌‌‌‌భాయ్ తులసిభాయ్ ఆదివారం బంజారాహిల్స్ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. గత నెల 29న బంజారాహిల్స్​లో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఎల్ ప్రతినిధులు ఒత్తిడి చేయగా, వారిని నమ్మి రూ. 9 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు.

అయితే యార్డులో కేవలం 1,320.82 మెట్రిక్ టన్నుల స్క్రాప్ మాత్రమే లభించగా, బాధితుడు కంగుతిన్నారు. తప్పుడు వివరాలతో తనను వంచించి సుమారు రూ. 6.30 కోట్ల నష్టం కలిగించడమే కాకుండా, తన సెక్యూరిటీ చెక్కులను కూడా నిందితులు దుర్వినియోగం చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.