ఫారెస్ట్ ఆఫీసర్ నవీన్‌‌‌‌కు కేంద్ర అవార్డు..యాంటీ పోచింగ్ విభాగంలో మరణానంతర పురస్కారం

ఫారెస్ట్ ఆఫీసర్ నవీన్‌‌‌‌కు కేంద్ర అవార్డు..యాంటీ పోచింగ్ విభాగంలో మరణానంతర పురస్కారం

హైదరాబాద్, వెలుగు: డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్‌‌‌‌ను కేంద్ర ప్రభుత్వం మరణానంతర అవార్డుతో గౌరవించింది. వన్యప్రాణుల సంరక్షణ, వేట నిరోధక చర్యల్లో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ‘ఫ్రంట్‌‌‌‌లైన్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ – ప్రొటెక్షన్‌‌‌‌ అండ్‌‌‌‌ యాంటీ పోచింగ్‌‌‌‌’ విభాగంలో ఈ పురస్కారం ప్రకటించింది.

సోమవారం కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ చేతుల మీదుగా నవీన్ భార్య, కుటుంబ సభ్యులు అవార్డును స్వీకరించారు. కార్యక్రమంలో అటవీ దళాధిపతి వినయ్ కుమార్ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అటవీ పరిధిలో విధులు నిర్వర్తించిన నవీన్.. వన్యప్రాణుల వేటను అరికట్టే క్రమంలో విద్యుత్ ఉచ్చుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఆయన త్యాగానికి అవార్డు దక్కింది.