హైదరాబాద్, వెలుగు: ఆన్లైన్ మెడిసిన్ డెలివరీ ప్లాట్ ఫామ్‌లతో అనుసంధానమై నిబంధనలు ఉల్లంఘిస్తున్న 23 మెడికల్ షాపుల లైసెన్సులను సస్పెండ్ చేస్తూ టీజీ సేఫ్ డ్రగ్స్ వింగ్ చర్యలు తీసుకుంది.
ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసుల సహకారంతో అక్టోబర్ 28న నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో గుర్తించిన షాపులపై చర్యలు చేపట్టినట్లు టీజీ సేఫ్ కమిషనర్ వెల్లడించారు. సస్పెండ్ చేసిన 23 మెడికల్ షాపుల్లో 15 షాపులపై తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని, మరో 8 షాపులను నిర్దిష్ట కాలానికి సస్పెండ్ చేశామని తెలిపారు.
