- రాష్ట్రంలోని 47 కాలేజీల్లో 1,350 మందికి సీట్లు.. 19న సాయంత్రం 4 లోగా రిపోర్టింగ్
- 20 నుంచి అకడమిక్ సెషన్
- లోకల్ ఏరియా పిటిషనర్లకు అండర్ టేకింగ్ తప్పనిసరి
హైదరాబాద్, వెలుగు: 2026–27 విద్యా సంవత్సరానికి కాంపిటెంట్ అథారిటీ కోటా కింద పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం మొదటి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించిన కాలేజీల వారీగా సవరించిన సీట్ల కేటాయింపు (రివైజ్డ్ అలాట్మెంట్) జాబితాను కాళోజీ వర్సిటీ సోమవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని 47 కాలేజీల్లో వివిధ ఎండీ, ఎంఎస్, డిప్లొమా కోర్సుల్లో మొత్తం 1,350 మందికి సీట్లు కేటాయించారు. సీట్లు పొందినవారు ఈ నెల 19న సాయంత్రం 4 గంటలలోపు రిపోర్ట్ చేయాలని, 20వ తేదీ నుంచి పీజీ కోర్సుల అకడమిక్ సెషన్ ప్రారంభమవుతుందని రిజిస్ట్రార్ ప్రకటించారు.
ప్రభుత్వ కాలేజీల్లో 735..ప్రైవేట్‌లో 615 మందికి సీట్లు
మొత్తం 1,350 సీట్లలో ప్రభుత్వ, స్వయంప్రతిపత్తి, ఈఎస్ఐ, సింగరేణి మెడికల్ కాలేజీలు కలిపి 25 సంస్థల్లో 735 మందికి సీట్లు దక్కగా, వీటిలో ఉస్మానియా మెడికల్ కాలేజీలో 209, గాంధీలో 101, వరంగల్ కాకతీయలో 74, నిమ్స్‌లో 54, సనత్‌నగర్ ఈఎస్ఐలో 44, నిజామాబాద్‌లో 34, ఆదిలాబాద్ రిమ్స్‌లో 30, సిద్దిపేటలో 29, నల్గొండలో 19, జనగామలో 19, మహబూబ్‌నగర్‌లో 16, సూర్యాపేటలో 15, కామారెడ్డిలో 15, కరీంనగర్లో 13, రామగుండం సింగరేణిలో 12, సంగారెడ్డిలో 9, ఖమ్మంలో 8, మంచిర్యాలలో 6, మహబూబాబాద్‌లో 6, వనపర్తిలో 5, జయశంకర్ భూపాలపల్లిలో 5, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, నాగర్‌కర్నూల్, నర్సంపేట ప్రభుత్వ కాలేజీల్లో 3 చొప్పున సీట్లు కేటాయించారు.
ఇక 22 ప్రైవేట్, మైనారిటీ కాలేజీల్లోని 615 సీట్లలో మహబూబ్‌నగర్ ఎస్వీఎస్లో 55, కరీంనగర్ ప్రతిమలో 50, సంగారెడ్డి ఎంఎన్‌ఆర్‌లో 43, కరీంనగర్ చల్మెడ ఆనందరావులో 41, ఖమ్మం మమతలో 40, హైదరాబాద్ అపోలోలో 36, బాచుపల్లి మమత అకాడమీలో 35, మెదక్ ఆర్వీఎంలో 33, మొయినాబాద్ భాస్కర్లో 32, ఘన్పూర్ మెడిసిటీలో 29, చేవెళ్ల డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డిలో 29, నార్కెట్‌పల్లి కామినేనిలో 28, హైదరాబాద్ కామినేని అకాడమీలో 28, దక్కన్ కాలేజీలో 24, వికారాబాద్ మహావీర్‌లో 19, అయాన్ ఇన్స్టిట్యూట్లో 18, పటాన్చెరు మహేశ్వరలో 17, హైదరాబాద్ షాదాన్లో 14, సిద్దిపేట సురభిలో 14, పటాన్చెరు టీఆర్ఆర్లో 13, మేడ్చల్ సీఎంఆర్‌లో 13, డాక్టర్ వీఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజీలో 4 సీట్లు అలాట్ అయ్యాయి.
