టెన్త్ ఎగ్జామ్ ఫీజు గడువు నవంబర్26 వరకు పొడగింపు

టెన్త్ ఎగ్జామ్ ఫీజు గడువు నవంబర్26 వరకు పొడగింపు
  • రూ.50 లేట్ ఫీజుతో డిసెంబర్ 8 వరకు అవకాశం

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఎస్సెస్సీ, ఓఎస్సెస్సీ, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపుల ప్రక్రియ ఈనెల 26 వరకు చేయొచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ లింగయ్య తెలిపారు. ఈ మేరకు సవరించిన ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ ను ఆయన రిలీజ్ చేశారు. రెగ్యులర్, వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు ఆలస్య రుసుము లేకుండా 26 వరకు హెచ్‌ఎంలకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 లేట్ ఫీజుతో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 8 వరకు, రూ.200 లేట్ ఫీజుతో డిసెంబర్ 10 నుంచి 21 వరకు ఫీజు చెల్లించవచ్చని వివరించారు.

రూ.500 లేట్ ఫీజుతో డిసెంబర్ 23 నుంచి జనవరి 4 వరకు అవకాశం కల్పించామన్నారు. మొదటి రెండు దశల స్కూల్ ఈఎన్‌ఆర్‌లను డీఈవోలు డిసెంబర్ 14 లోపు, చివరి రెండు దశల వాటిని జనవరి 7 లోపు డీజీఈకి సమర్పించాలని ఆదేశించారు. కాగా, అన్ని సబ్జెక్టులకు లేదా మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125, మూడు సబ్జెక్టుల వరకు రూ.110, ఒకేషనల్ విద్యార్థులకు రెగ్యులర్ ఫీజు రూ.125తో పాటు అదనంగా రూ.60 ఫీజుగా ఉంది.