వనపర్తి, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వనపర్తి నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.2,389 కోట్లతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారంటీల అమలుకు సుమారు రూ.1,000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. గత పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.
కేఎల్‌ఐ కింద కర్నెతండా లిఫ్టు, బుద్ధారం, ఖిల్లాగణపురం బ్రాంచ్ కెనాళ్లకు ద్వారా 45 వేల ఎకరాలకు నీరందించే పనులు పూర్తి చేశామని, గతంలో జరిగిన పనులకు కొందరు రాజకీయ రంగు పులుముకుంటున్నారని విమర్శించారు. తనపై వస్తున్న వ్యక్తిగత భూ ఆరోపణలపై స్పందిస్తూ, అది ప్రభుత్వ భూమని నిరూపిస్తే వాళ్లకే రాసిస్తానని, దీనిపై జడ్పీటీసీ రఘపతిరెడ్డి వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
