హైదరాబాద్, వెలుగు: నల్గొండలో తాగునీటి సరఫరాను మెరుగుపర్చేందుకు చేపట్టనున్న వాటర్ సప్లయ్ ఇంప్రూవ్‌మెంట్ స్కీమ్ మొదటి దశ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.83 కోట్ల రుణానికి అనుమతి ఇచ్చింది. ఈ రుణాన్ని తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌కు అందజేయనుంది.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభ్యర్థన మేరకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖ సెక్రటరీ శ్రీదేవి బుధవారం ఉత్తర్వులిచ్చారు. ఈ విషయపై తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా టీయూఎఫ్ఐడీసీ వైస్ చైర్మన్, సీఎండీని ఆదేశించారు.
