పంట మార్పిడితోనే నేలల సంరక్షణ.. ఎరువులు వాడకుండానే భూమిని రక్షించుకోవాలి

పంట మార్పిడితోనే నేలల సంరక్షణ.. ఎరువులు వాడకుండానే భూమిని రక్షించుకోవాలి

వనపర్తిరేవల్లి, వెలుగు: రైతులు ఎప్పుడూ ఒకే పంట వేయకుండా పంట మార్పిడి విధానాన్ని అవలంభించాలని, మోతాదుకు మించి ఎరువులు వాడకుండా నేలలను సంరక్షించుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం గోపాల్‌‌‌‌పేట మండలం జయన్న తిరుమలాపూర్ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ముగింపు గ్రామసభలో వారు మాట్లాడారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తికి శ్రమిస్తున్నారని, రైతులు సన్న రకం వరి సాగుపై మొగ్గు చూపాలని సూచించారు. అన్ని వసతులున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించి ఉన్నత చదువులు చదివించాలని, బాల్యవివాహాలను అరికట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు.  ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు.