లండన్: అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించిన లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్.. ఇంగ్లిష్ కౌంటీల్లో ఆడనున్నాడు. ఈ మేరకు రాబోయే రెండు రౌండ్ల మ్యాచ్‌ల కోసం వార్విక్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. దాంతో ఈ నెల 12 నుంచి 15 వరకు స్కార్‌బరోలో యార్క్‌షైర్‌తో, ఆ తర్వాత సోమర్‌సెట్‌తో జరిగే మ్యాచ్‌కు సుతార్ అందుబాటులో ఉంటాడు.
‘మానవ్‌ను మా బియర్స్ జట్టులోకి స్వాగతించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సీజన్ రెడ్ బాల్ క్రికెట్‌లో మా జట్టు మంచి ప్రదర్శన చేస్తోంది. సుతార్ రాకతో మా బౌలింగ్ యూనిట్‌కు మరింత బలం చేకూరుతుంది. టీమిండియాకు ఆడటమే అతని ప్రతిభకు నిదర్శనం’ అని వార్విక్‌షైర్ పెర్ఫామెన్స్ డైరెక్టర్ జేమ్స్ థామస్ పేర్కొన్నాడు. అఫ్గాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన సుతార్ మొత్తం 7 వికెట్లు తీసి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
