వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటికీ 86 కోట్లు

వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటికీ  86 కోట్లు

హైదరాబాద్, వెలుగు: వేములవాడ టెంపుల్​ ఏరియా డెవలప్​మెంట్​ అథారిటికీ రూ.86.25 కోట్లు మంజూరు చేస్తూ బుధవారం రాష్ట్ర మున్సిపల్​ శాఖ సెక్రటరీ టీకే శ్రీదేవి ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు వేర్వేరుగా రెండు జీవోలను జారీ చేశారు. 

2026–27 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో భాగంగా వేములవాడ టెంపుల్ ఏరియాలో చేపడుతున్న అభివృద్ధి పనులకు మొదటి జీవోలో రూ.35.25 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.51 కోట్లకు పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ రెండో జీవో జారీ చేశారు.