ఆర్మూర్లో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక

ఆర్మూర్లో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక

ఆర్మూర్​, వెలుగు: ఆర్మూర్ మున్సిపల్​ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం మంగళవారం టౌన్​ లోని 2, 15 వ వార్డుల్లో నిర్వహించారు. ఘన, వ్యర్థ పదార్థాల  నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాత బస్టాండ్ ఏరియాలోని వ్యాపారులకు ప్లాస్టిక్ బ్యాన్ పై అవగాహన కల్పించారు. 

ఇంటింటికి తిరుగుతూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని, సీజనల్ వ్యాధులపై  జాగ్రత్త వహించాలని చెప్పారు. వీధి కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, ఇన్​చార్జి శానిటరీ ఇన్​స్పెక్టర్ సురేశ్​, వార్డ్ ఆఫీసర్లు,  జవాన్లు, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు.