2028 నాటికి 1,00‌‌‌‌‌‌‌‌0 స్టోర్లు

 2028 నాటికి 1,00‌‌‌‌‌‌‌‌0 స్టోర్లు

   ముంబై: టాటా స్టార్‌‌‌‌బక్స్ మంగళవారం తన స్టోర్ల సంఖ్య ఇప్పుడున్న 390 నుంచి 2028 నాటికి 1,000 స్టోర్లకు విస్తరించనున్నట్లు ప్రకటించింది.   టాటా గ్రూప్  గ్లోబల్ కాఫీ చైన్ స్టార్‌‌‌‌బక్స్ మధ్య జాయింట్ వెంచర్ అయిన ఈ కంపెనీ, ప్రతి మూడు రోజులకు ఒక కొత్త స్టోర్‌‌‌‌ను ప్రారంభించాలని,  టైర్-2,  టైర్-3 నగరాల్లోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు తెలిపింది.  2028 నాటికి ఈ సంస్థ తన ఉద్యోగుల సంఖ్యను 8,600 మందికి పెంచుతుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులతో పోలిస్తే ఇది రెట్టింపు. టైర్ 2,  3 భారతీయ నగరాల్లోకి ప్రవేశిస్తామని, డ్రైవ్-త్రూలు, విమానాశ్రయాలల్లో స్టోర్ల సంఖ్యను పెంచుతామని తెలిపింది.