తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 1,197 కరోనా కేసులు

తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 1,197 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1,19,537 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,197 పాజిటివ్ కేసులుగా నిర్ధారణయ్యాయి.GHMC పరిధిలో అత్యధికంగా 137 కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది.నల్గొండలో 84, సూర్యాపేటలో 72, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, భద్రాద్రి కొత్తగూడెంలలో 71 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 1 పాజిటివ్ కేసు గుర్తించారు. 1,707 మంది కరోనా నుంచి కోలుకోగా.. 9 మంది చనిపోయారు. మొత్తంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 3,576కి పెరిగింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,14,399 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,93,577 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇంకా 17,246 మంది చికిత్స పొందుతున్నారు.