కేంద్ర మంత్రి ఇంటికి నిప్పు.. పెట్రోల్ బాంబులు విసిరి దాడి

కేంద్ర మంత్రి ఇంటికి నిప్పు.. పెట్రోల్ బాంబులు విసిరి దాడి

షెడ్యూల్డ్ తెగలలో చేర్చాలనే డిమాండ్‌పై రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్న ఈశాన్య రాష్ట్రంలో తాజాగా హింసాకాండలో జూన్ 15న రాత్రి మణిపూర్‌లో వెయ్యి మందికి పైగా ఒక వర్గానికి చెందిన గుంపు ఓ కేంద్ర మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు. ఇంఫాల్‌లోని కొంగ్ బాలో ఘటన జరిగిన సమయంలో కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ లోని ఇంట్లో లేరని అధికారులు తెలిపారు.

ఇంఫాల్‌లో కర్ఫ్యూ ఉన్నప్పటికీ గుంపు కొంగ్బాలోని మంత్రి ఇంటికి చేరుకోగలిగింది. ఆ సమయంలో మంత్రి నివాసంలో తొమ్మిది మంది సెక్యూరిటీ ఎస్కార్ట్ సిబ్బంది, ఐదుగురు సెక్యూరిటీ గార్డులు, ఎనిమిది మంది అదనపు గార్డులు విధుల్లో ఉన్నారని అధికారులు తెలిపారు. దాడి సమయంలో గుంపు నలువైపుల నుంచి పెట్రోల్ బాంబులు విసిరినట్లు మంత్రి ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బంది తెలిపారు.

మూకలోని సభ్యులు చాలా మంది ఉన్నందున సంఘటనను నిరోధించలేకపోయామని, తాము పరిస్థితిని నియంత్రించలేకపోయామని ఎస్కార్ట్ కమాండర్ ఎల్ దినేశ్వర్ సింగ్ అన్నారు. వా ఒక్కసారి రు అన్ని వైపుల నుంచి వచ్చి.. పెట్రోల్ బాంబులను విసిరారని, భవనం వెనుక బై లేన్ నుంచి, ముందు ద్వారం నుంచి వచ్చారని చెప్పారు. ఈ గుంపులో దాదాపు 1,200 మంది ఉండొచ్చనిని ఎస్కార్ట్ కమాండర్ అంచనా వేశారు. మంత్రి ఇంటిపై మూకుమ్మడి దాడి జరగడం ఇది రెండోసారి. మేలో జరిగిన దాడిలో గుంపును చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపారు.

ఇంఫాల్ తూర్పులో మణిపూర్ ఏకైక మహిళా మంత్రి నెంచా కిప్‌జెన్ ఇంటిపై మూకల దాడి జరిగిన మరుసటి రోజే కేంద్ర మంత్రి ఇంటిపై దాడి జరగడం గమనార్హం. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతేయి కమ్యూనిటీ డిమాండ్‌కు నిరసనగా మే 3న కొండ జిల్లాల్లో 'గిరిజన సంఘీభావ యాత్ర' నిర్వహించిన తర్వాత మణిపూర్‌లో ఘర్షణలు చెలరేగాయి. ఇప్పటి వరకు దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు, మంత్రులపై దాడులు జరిగాయి. మే 25న కేంద్ర మంత్రి రంజన్ సింగ్ ఇంటిపై మూకలు దాడి చేసి ఇంటిని ధ్వంసం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.