బీజింగ్‌‌ వింటర్‌‌ ఒలింపిక్స్‌‌: బాయ్ కాట్ చేస్తున్న మరిన్ని దేశాలు

బీజింగ్‌‌ వింటర్‌‌ ఒలింపిక్స్‌‌: బాయ్ కాట్ చేస్తున్న మరిన్ని దేశాలు

టొరంటో: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వింటర్‌‌ ఒలింపిక్స్‌‌కు ఆతిథ్యం ఇస్తున్న చైనాకు మరో దేశం షాకిచ్చింది. యూఎస్‌‌ఏ, యూకే, ఆస్ట్రేలియా మాదిరిగా  బీజింగ్‌‌ గేమ్స్‌‌ను డిప్లమేటిక్‌‌ (దౌత్యపరంగా) బాయ్‌‌కాట్‌‌ చేస్తున్నట్టు కెనడా ప్రైమ్‌‌ మినిస్టర్‌‌ జస్టిన్‌‌ ట్రుడావు గురువారం ప్రకటించారు. చైనాలో  మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.   గేమ్స్‌‌ కోసం   తమ దౌత్య ప్రతినిధులను పంపించకపోయినా చైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.  గేమ్స్‌‌ను బాయ్‌‌కాట్‌‌ చేస్తే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని చైనా హెచ్చరించినా కూడా కెనడా వెనక్కుతగ్గలేదు. కాగా, డిప్లమేటిక్‌‌ బాయ్‌‌కాట్‌‌ చేసినప్పటికీ.. ఆయా దేశ అథ్లెట్లు వింటర్‌‌ గేమ్స్‌‌లో పోటీ పడేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు.