గాఢనిద్రలో ఉండగా భూకంపం.. అరగంటలో మూడుసార్లు

గాఢనిద్రలో ఉండగా భూకంపం.. అరగంటలో మూడుసార్లు

దేశంలో ఓ పక్క వరదలు బీభత్సం సృష్టిస్తుంటే.. మరోపక్క జైపూర్‌లో మాత్రం భూకంపాలు భయపెడుతున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున అరగంట వ్యవధిలోనే మూడు సార్లు భూమి కంపించడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 3.4 తీవ్రతతో  తెల్లవారుజామున 4.25 గంటలకు ఒకసారి, సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) నివేదించింది. NCS ప్రకారం, ఇది 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది.

అంతకుముందు ఉదయం 4.09 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో మొదటి భూకంపం రాగా.. ఉదయం 4.22 గంటలకు 5 కిలోమీటర్ల లోతులో 3.1 తీవ్రతతో మరోసారి భూమి కంపించిందని NCS ట్వీట్ చేసింది. ఈ ఘటనలపై ప్రాణనష్టం లేదా నష్టానికి సంబంధించిన సమాచారం మాత్రం ఇంకా తెలియరాలేదు.

ఈ ప్రకంపనలపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కూడా స్పందించారు. "జైపూర్‌తో సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో భూకంపం సంభవించింది. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను" అంటూ ట్విట్టర్ ద్వారా రాసుకొచ్చారు.

जयपुर सहित प्रदेश में अन्य जगहों पर भूकंप के तेज़ झटके महसूस किए गए हैं।
I hope you all are safe!

#Jaipur #earthquake #Rajasthan

— Vasundhara Raje (@VasundharaBJP) July 20, 2023