సిటీలో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌

 సిటీలో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌

హైదరాబాద్​సిటీ, వెలుగు: 30వ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ (ఈయుఎఫ్ఎఫ్​)కు నగరం వేదికగా మారింది. ప్రసాద్ ల్యాబ్ ప్రీవ్యూ థియేటర్‌, సారథి స్టూడియోస్‌, అలయన్స్ ఫ్రాంసేజ్​లో శనివారం నుంచి  ఈ చిత్రాల ప్రదర్శన జరుగుతోంది. ఈఫిలిం ఫెస్టివల్​ కార్యక్రమానికి  పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

వీరిలో యూరోపియన్ యూనియన్ భారత ప్రతినిధి బృందానికి చెందిన లొరెన్జో పారుల్లీ, సారథి స్టూడియోస్ చైర్మన్ ఎంఎస్ఆర్వీ ప్రసాద్, హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ అధ్యక్షుడు కె.వి.రావు, అలయన్స్ ఫ్రాంచైజ్​హైదరాబాద్ డైరెక్టర్ మాడ్ మిక్వా, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరశంకర్, హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ వైస్‌ ప్రెసిడెంట్ శ్యాన్ జి.కే, ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తదితరులు ఉన్నారు.