
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రముఖ బహుళజాతి సాఫ్ట్ వేర్ సంస్థ సర్వీస్ నౌ నిర్వహించే సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ (సిఎస్ఏ) పరీక్షలో తమ కళాశాలకు చెందిన 33 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ గురువారం తెలిపారు.
అమెరికా కేంద్రంగా సేవలు అందిస్తున్న సర్వీస్ నౌ లో తమ విద్యార్థులు ప్రతిభను చూపడం ద్వారా ప్రపంచ స్థాయి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించి అభినందించారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ జీ ధాత్రి, ప్రిన్సిపాల్ జీ రాజ్ కుమార్, అకడమిక్ డైరెక్టర్స్ గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, ఏవీవీ శివ ప్రసాద్, జే.రవీంద్రబాబు, టీపీఓ ఎన్ సవిత, కోఆర్డినేటర్ జీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.