
ప్రతిఒక్కరి ఇంట్లో ప్రెషర్ కుక్కర్ సాధారణం. ఎందుకంటే వంట కోసం ఎక్కువగా చాల ఇళ్లల్లో వాడేది ఇదే. ఎందుకంటే వంట త్వరగా అవుతుంది, ఇంకా వంట కోసం టైం ఆదా అవుతుంది. కొన్ని రకాల వంటలు లేదా కూరగాయలు వండడానికి కుక్కర్ ఒక్కటే బెస్ట్... అయినాసరే అన్ని రకాల కూరగాయలు, ఆహార పదార్థాలను ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించొద్దని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
కొన్ని ఆహార పదార్థాలను ప్రెషర్ కుక్కర్‌లో వండటం వల్ల వాటి పోషక విలువలు పోతాయి. అంతేకాకుండా, కొన్నిసార్లు ఆరోగ్యానికి హాని చేసే కొన్ని రకాల ఆహారంగా కూడా ఏర్పడవచ్చు. అందుకే, ప్రెషర్ కుక్కర్‌లో వండేటప్పుడు ఎలాంటి ఆహారాలు వాడకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించకూడని కూరగాయలు: పాలకూర, లెట్యూస్, గుమ్మడికాయ లేదా బ్రోకలీ వంటి లేత కూరగాయలను స్టవ్ మీద కొన్ని నిమిషాలే ఉడికించాలి. ప్రెజర్ కుక్కర్‌లో అధిక వేడి, ఆవిరి వల్ల వాటి రంగు, అందులోని పోషకాలు పోతాయి.
ALSO READ : పూణే రెస్టారెంట్ వింత ఆలోచన
ప్రెజర్ కుక్కర్‌లో పాస్తా, నూడుల్స్: పాస్తా, నూడుల్స్ లేదా మాకరోనీ వంటివి నీటిని చాలా త్వరగా పీల్చుకుంటాయి. ప్రెషర్ కుక్కర్‌లో పాస్తాకి సరిపడ నీరు పోయడం ఒకోసారి కష్టం. అందుకే మెత్తగా, ముద్దగా అంటుకునేల మారొచ్చు.
సీఫుడ్, చేపలు: పామ్‌ఫ్రెట్, సాల్మన్ లేదా రొయ్యలు లాంటి సీఫుడ్, చేపలని కొన్ని నిమిషాల పాటు ఉడికిస్తే చాలు. కుక్కర్ లోపల అధిక వేడి వాటిని ఈజీగా క్షణాల్లో ఉడికిస్తుంది. సీ ఫుడ్ లేదా చేపలు ఆవిరి మీద ఉడికించడం, గ్రిల్ చేయడం లేదా పాన్-సీరింగ్ వంటి వాటిలో వండినప్పుడు బాగా టేస్టీగా ఉంటాయి.
కుక్కర్లో చేయకూడని వంటకాలు: పాలు, క్రీమ్ లేదా జున్నుతో చేసే ఖీర్, కస్టర్డ్ లేదా పనీర్ వంటి వంటలు కుక్కర్లో చేయకూడదు. అధిక వేడి ఆవిరి వల్ల పాల ఉత్పత్తులు విరిగిపోవడం లేదా ముద్దగా అవుతాయి. తక్కువ వేడి మీద వీటిని ఉడికించడం వల్ల మృదువైన ఆకృతి వస్తుంది ఇంకా వంట చెడిపోకుండా ఉంటుంది.
ప్రెషర్ కుక్కర్‌లో కేకులు, బ్రెడ్లు: కుక్కర్‌లో కేకులు, బ్రెడ్ అనుకున్నట్లు ఉడకవు. దీనికి కారణం ప్రెషర్ కుక్కర్ లోపల ఉన్న తేమ. ఓవెన్లో ఉండే పొడి వేడి(dry heat)కి కుక్కర్ పూర్తిగా వేరేలా ఉంటుంది. అంతేకాకుండా కుక్కర్‌లో కుకీలు లేదా బ్రెడ్ పైన ఉండే క్రస్ట్ (పొర) ఏర్పడదు. కొందరు ప్రెషర్ కుక్కర్‌లో కేకులు తయారుచేయడానికి ట్రై చేసిన ఓవెన్లో చేసినంత స్పాంజీగా ఉండదు.