పూణే రెస్టారెంట్ వింత ఆలోచన: ఫుడ్ వేస్ట్ చేస్తే ఏం చేస్తారంటే.. ఆన్‌లైన్‌లో రచ్చ..

పూణే రెస్టారెంట్ వింత ఆలోచన: ఫుడ్ వేస్ట్ చేస్తే ఏం చేస్తారంటే.. ఆన్‌లైన్‌లో రచ్చ..

ఏదైనా రెస్టారెంట్ లేదా హోటల్ వెళ్ళినపుడు మనకి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేస్తాం, ఒకోసారి తినాలనిపించిన లేదా టేస్ట్ చేయాలనుకున్న ఫుడ్ ఆర్డర్ చేస్తాం... మనం ఆర్డర్ చేసిన ఫుడ్ తిన్నాక  మిగిలింది వొదిలేస్తుంటాం... కొందరైతే దానిని పార్సెల్ చేయించుకొని ఎవరికైనా ఆకలితో ఉన్నవాళ్ళకి ఇస్తుంటారు... అయితే సాధారణంగా ఫ్రెండ్స్ తో లేదా ఫామిలీతో వెళ్ళినపుడు ఆర్డర్ చేసిన ఫుడ్ మిగిలితే వదిలేస్తుంటారు.. ఇలా వొదిలేసిన ఫుడ్ వృధా అవుతుంది, చివరికి చెత్తబుట్టలో చేరుతుంది. ఆకలిని తీర్చే ఆహారాన్ని వృధా చేయకుండా ఓ రెస్టారెంట్ కొంచెం కొత్తగా ఆలోచించింది, ఇది అనుకోకుండా సూపర్ హిట్ అయ్యింది.       

పూణేలోని ఒక సౌత్  ఇండియన్  రెస్టారెంట్ ఆహారాన్ని వృధా చేస్తే రూ.20 ఎక్స్ట్రా ఛార్జీ  అవుతుందని బోర్డు పెట్టింది. ఈ కొత్త ఆలోచన ఆహారాన్ని, దానిని వండే  సిబ్బందిని గౌరవించమని,  వృధా చేయడం తగ్గించుకోమని ప్రోత్సహిస్తుంది. దీనికి సంబంధించి Xలో ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో రెస్టారెంట్ చేతితో రాసిన మెనూ ఫోటో ఉంది. ఇంకా ఆహారాన్ని వృధా చేస్తే  రూ.20 అదనంగా ఛార్జీ అవుతుందని చూపిస్తుంది.

ALSO READ : ఒడిశాలో బయటపడ్డ 20 వేల కేజీల గోల్డ్ రిజర్వ్స్..
ఈ పోస్టుకి ప్రతి రెస్టారెంట్ కూడా ఇలాగే  చేయాలి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కూడా జరిమానాలు వసూలు చేయాలి అంటూ రకరకాల  కామెంట్లు  వచ్చాయి. మరికొందరు  దీనిని విమర్శించారు కూడా. ఒకతను ఫుడ్ తినలేకపోతే లేదా టేస్ట్ నచ్చకపోతే ఎం చేస్తారు అని, ఇంకా తిన్న తరువాత మిగిలిన దానికి   రూ.20 ఎక్స్ట్రా వసూలు చేయడం ఏంటి అని ? ఇలా ప్రశ్నించారు.