
ఆరోగ్యంగా ఉండడానికి ఏవేవో తినడం చూస్తుంటారు... సీజనల్ వ్యాధులు, అంటూ వ్యాధులు ఎక్కువగా ఉండే ఈ వర్షాకాలంలో ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు... కానీ మీకు తెలుసా... మనం ఆరోగ్యంగా ఉండటం విషయానికి వస్తే, మీ వంటగదే మీరు వాడే అన్నిటికంటే ఎక్కువ శక్తితో నిండి ఉంది. రోగనిరోధక వ్యవస్థ అనేది ఇన్ఫెక్షన్ల నుండి మీ శరీరానికి సహజ రక్షణ ఇస్తుంది. మీరు వంటలో ఉపయోగించే ప్రతిరోజు వాడే ఈ పదార్థాలు నిశ్శబ్దంగా మీ రోగనిరోధక శక్తికి ఇంధనంగా పనిచేస్తాయి. జలుబు, ఫ్లూ, అలసట వంటి వాటిని అరికట్టడంలో సహాయపడే ఈ సాధారణ పదార్థాలు ఏవో తెలుసా...
పసుపు: ఇదొక ఒక సహజ నిరోధక శక్తికి కేంద్రంలాంటిది. పసుపు కళ్ళకు కనిపించని బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది ఇంకా మీ రోగనిరోధక శక్తి పనితీరుకు సపోర్ట్ చేస్తుంది. వేడు పాలు, కూరల్లో పసుపు వేయడం వల్ల రుచి పెరుగుతుంది ఇంకా మీ మొత్తం రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఇంకా అరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.
వెల్లుల్లి: వెల్లుల్లి కేవలం టెస్ట్ కోసమే కాదు, ఇందులో అల్లిసిన్ అనే పదార్ధం ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే జలుబులాంటివి తగ్గించి, శరీర రోగనిరోధక వ్యవస్థను బలంగా చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
అల్లం: గొంతు నొప్పి, జీర్ణ సమస్యలను తగ్గించడంలో అల్లం చాల సహాయపడుతుంది. అల్లంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్న జింజెరాల్ ఉంటుంది. ఒక కప్పు అల్లం టీ లేదా గోరువెచ్చని అల్లం నీరు మీ రోగనిరోధక శక్తిని పెంచుతూ, మీ శరీరాన్ని అధిక వేడి నుండి చల్లబరుస్తుంది.
సిట్రస్ పండ్లు (నిమ్మ, నారింజ, ఉసిరి): విటమిన్ సితో నిండిన నిమ్మ, నారింజ, ఉసిరి వంటి సిట్రస్ పండ్లు తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి, ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి చాలా అవసరం. నీటిలో నిమ్మకాయ పిండి, ఉదయం నారింజ రసం లేదా ఉసిరి తీసుకోవడం వల్ల మీ శరీరానికి కావాల్సిన విటమిన్ సి అందుతుంది.
►ALSO READ | Capsicum Curry Recipe : ఖతర్నాక్ క్యాప్సికం కర్రీలు.. ఇష్టంగా ఇలా వండండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
తేనె: ప్రకృతి ప్రసాదించిన సహజ ఔషధం తేనె. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబయల్ గుణాలు ఉంటాయి. ఇంకా దగ్గును(cough) తగ్గించడంలో సహాయపడుతుంది, మీ శ్వాసకోశ ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తి కోసం హోమ్ రెమెడీగా పసుపు, అల్లంతో తీసుకుంటే చాల బాగా పనిచేస్తుంది, మంచి ఫలితాలు ఉంటాయి.
మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఖరీదైన మందులు అవసరం లేదు. మన ఇంట్లో ఉండే పసుపు, వెల్లుల్లి, ఉసిరి పండ్లు వంటి సాధారణ, ప్రతిరోజు తినే వాటితో ఇన్ఫెక్షన్ల నుండి పోరాడే శక్తిని పెంచుతాయి ఇంకా మీ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతాయి.