
పద్మారావునగర్, వెలుగు: గాంధీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు వైద్య శాఖ నియామక ప్రక్రియ ప్రారంభించింది. ఈ నెల 15 నుంచి చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ మంగళవారం ముగిసింది.
అన్ని పోస్టులకు కలిపి 870 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 23 నుంచి 26 వరకు స్క్రూటినీ, 28న మెరిట్ లిస్టు, 29, 30 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, ఆగస్టు 2న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని.. ఆగస్టు 4న సెలక్షన్ ఫైనల్ లిస్ట్ ను విడుదల చేస్తామని ఆఫీసర్లు ప్రకటించారు.