లక్షల మంది విద్యార్థులు.. డాక్లర్లు అవ్వాలని కలలు గంటూ.. లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్లి.. నిద్రాహారాలు మరిచి ప్రిపేర్ అవుతుంటారు నీట్ పరీక్షకు. అలాంటి విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతూ.. కొశ్చన్ పేపర్ లీకవ్వటం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ఎన్టీఏ వంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్వహించే పరీక్షకు సంబంధించి.. వందల ప్రశ్నలు కోచింగ్ సెంటర్ లో ప్రత్యక్షమవ్వటమేంటి..? కోచింగ్ సెంటర్ ఇచ్చిన ప్రాక్టీస్ పేపర్ లో అన్ని ప్రశ్నలు మ్యాచవ్వటమేంటి..? లక్షల మంది భవిష్యత్తుకు ముడిపడిన అంశం కావటంతో దేశ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తోంది ఈ అంశం.
నీట్ పరీక్ష లో మొత్తం 600 ప్రశ్నలుంటాయి. అందులో 120 ప్రశ్నలు ఒక కోచింగ్ సెంటర్ ప్రశ్నాపత్రానికి మ్యాచ్ అయ్యాయి. మొత్తం లీకైన ప్రశ్నల్లో బయాలజీ నుంచి 90 బయాలజీ, కెమిస్ట్రీ నుంచి 20 ప్రశ్నలు యాజిజీట్ గా దిగినట్లు తేలింది. రాజస్థాన్ లోని ఒక ఇనిస్ట్యూట్ నిర్వహించిన ప్రాక్టీస్ ఎగ్జామ్ లో.. గెస్ పేపర్ అంటూ విద్యార్థులకు పంచిన పేపర్ లో మొత్తం 410 ప్రశ్నలుండగా అందులో 120 ప్రశ్నలు మ్యాచ్ అయ్యాయి.
►ALSO READ | నీట్ పరీక్ష పేపర్ ఎక్కడ లీక్ అయ్యింది.. కుట్ర దారులు ఎవరు.. పాత్రదారులు ఎవరు.. ఎంతకు అమ్మారు..!
మొత్తం 410 ప్రశ్నలతో తయారు చేసిన పీడీఎఫ్ ఫైల్ బయటకు రావటంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇందులో మొత్తం 120 ప్రశ్నలు సేమ్ టు సేమ్ ఉండటంతో దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. దీంతో 2026 మే 12న పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. మార్చి 3న జరిగిన పరీక్షకు మొత్తం 22 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంత మంది భవిష్యత్తుతో ఆటలాడుకున్న కోచింగ్ సెంటర్.. వారికి సహకరించిన అధికారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
