గుండెపోటుతో ఐదేళ్ల బాలుడు మృతి

గుండెపోటుతో ఐదేళ్ల బాలుడు మృతి

కరోనా తర్వాత గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. కానీ ప్రతీసారీ ఇన్ఫెక్షన్ జరగకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. పుట్టుకతో వచ్చే సమస్యలు కూడా గుండెపోటుకు కారణాలవుతాయని అంటున్నారు. అత్యంత విషాదకరమైన, షాకింగ్ ఘటన ఓ బాలుడి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా 5 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఇటీవలే చోటుచేసుకుంది.

లూసియస్ కొర్రీ అనే బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి ఓ రోజు థీమ్ పార్కును సందర్శించడానికి వెళ్లాడు. అది జరిగిన ఒక రోజు తర్వాత అతను అనారోగ్యం పాలయ్యాడు. ఆ తర్వాత అతని ఆరోగ్యం విషమించడంతో మరణించాడు. కొంతకాలంగా తమ కొడుకు రంగు మారిపోయాడని, పార్క్ కు వెళ్లినపుడు బాగానే ఉన్నాడని తల్లిదండ్రులు నివేదించారు. అక్కడ ఓ 10 నిమిషాలు ఆడుకున్న తర్వాత బ్రేక్ తీసుకోగా.. అతని భోజనం తినిపించాలని ప్రయత్నించగా వాంతులు చేసుకున్నాడన్నారు. మరుసటి రోజున 3 గంటలకు అతని ముక్కు నుంచి రక్తం కారిందని, ఆ తర్వాత అతని శరీరం మొత్తం నీలం రంగులోకి మారిపోయిందని చెప్పారు. అప్పటికే డౌన్స్ సిండ్రోమ్ తో బాధపడుతున్న ఆ బాలుడు స్పందించలేదు సరికదా.. తిరిగి లేవలేకపోయాడు కూడా. అతనికి పలు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అతనికి అంటువ్యాధులేవీ లేవని, కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యాడని నిర్ధారించారు.

కార్డియాక్ అరెస్ట్ ఎందుకు వస్తుందంటే..

  • ధూమపానం
  • ఆల్కహాల్ తీసుకోవడం
  • ఊబకాయం
  • హైపర్ టెన్షన్
  • అధిక కొలెస్ట్రాల్

చాలా సందర్భాల్లో కార్డియాక్ అరెస్ట్ అకస్మాత్తుగా సంభవిస్తుంది. ఆ సమయంలో ట్రీట్ మెంట్ అత్యవసరం. 

లక్షణాలు :

  • వెన్నునొప్పి
  • విపరీతమైన అలసట
  • శ్వాస ఆడకపోవడం
  • వికారం
  • వాంతులు
  • బొడ్డు నొప్పి
  • ఛాతి నొప్పి
  • ఫ్లూ వంటి లక్షణాలు