ఎగ్జామ్స్​కు నెలన్నరే టైమ్​.. స్టూడెంట్స్​ పరేషాన్

ఎగ్జామ్స్​కు నెలన్నరే టైమ్​.. స్టూడెంట్స్​ పరేషాన్
  • కంప్లీట్ ​కాని ఇంటర్మీడియట్​ సిలబస్
  • రికార్డ్స్ వర్క్ లేకుండానే ప్రాక్టికల్స్
  • రివిజన్​పైనే ఫోకస్ ​చేసిన ఫ్యాకల్టీలు
  • టెన్షన్​ పడే స్టూడెంట్స్ కు ​కౌన్సెలింగ్ ఇవ్వట్లే

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ కి ఇంకా నెలన్నర కూడా టైమ్ లేదు. ఇప్పటి వరకు సిలబస్ కంప్లీట్​కావాల్సి ఉండగా సగం కూడా కాలేదు. గతేడాది కరోనా కారణంగా ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహించగా దాదాపు 50 శాతం స్టూడెంట్స్ కూడా అటెండ్ కాలేదు. ఫిజికల్ క్లాసులు మొదలైన ప్పటికీ టైమ్ తక్కువగా ఉండడంతో  ఫ్యాకల్టీలు రివిజన్ మీదనే ఫోకస్ పెట్టారు. దీంతో ఆన్ లైన్ లో క్లాస్ వినని,  సబ్జెక్ట్ లు అర్థం కాని స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయడం ఎలా అనే టెన్షన్ లో ఉన్నారు.   ఎగ్జామ్స్ టైమ్ లో ఇంటర్ స్టూడెంట్స్   చాలా ఒత్తిడిలో ఉంటారు. దీన్ని దృష్ట్యా ప్రభుత్వం, కాలేజ్ మేనేజ్ మెంట్లు ఎగ్జామ్స్ కి ముందు, రిజల్ట్స్ వచ్చే టైమ్​లో కౌన్సిలింగ్ సెషన్లు నిర్వహిస్తాయి. ఈఏడాది వీటి అవసరం ఇంకా ఎక్కువ ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదు. ఎగ్జామ్స్ పేరుతో సిలబస్, రివిజన్ పైనే దృష్టి పెట్టాయి. కౌన్సిలింగ్ సెషన్ల మాటే వినిపించడం లేదు. 
 డిజిటల్ క్లాసులు నడిచినా.. 
ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అంటేనే స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్​ కూడా ఆందోళన పడుతుంటారు.  రిజల్ట్ లో తేడా వస్తే స్టూడెంట్స్ డిప్రెషన్​లోకి పోయే చాన్స్​ఎక్కువగా ఉంటుంది. గతంలో  ఇలా చాలా మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్న ఘటనలు ఉన్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ముందుగా వారిని మెంటల్లీ స్ట్రాంగ్ గా  తయారు చేయాల్సి ఉంది. ఈసారికి అలాంటి వాటిపై దృష్టి పెట్టకపోవడంతో స్టూడెంట్స్ మానసిక ఆందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ కారణంగా డిజిటల్ క్లాసులు నడిచినా ఈ ఏడాది అకడమిక్ ఇయర్ లో చాలా మంది స్టూడెంట్స్ కు సబ్జెక్ట్ కు సంబంధించి ఏమీ అర్థం కాలేదు. దీనికి తోడు 
రికార్డ్స్ ఇన్ టైంలో సబ్మిట్ చేయడంతో పాటు ప్రాక్టికల్స్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుందని లెక్చరర్స్ చెబుతున్నారు.  ఆ వెంటనే ఫైనల్ ఎగ్జామ్స్ ఉండడంతో ఇంత తక్కువ టైం లో  ఎలా ప్రిపేర్ అవ్వాలన్న దానిపై స్టూడెంట్స్ ఆందోళన చెందుతున్నారు. 
 టైమ్ తక్కువగా ఉండగా..
ప్రస్తుతం ఇంటర్​కాలేజీల్లో ఫిజికల్ క్లాసులకు 60 నుంచి 70 శాతం స్టూడెంట్స్ మాత్రమే అటెండ్​ అవుతున్నా రు. మిగిలిన స్టూడెంట్స్ కోసం ఆన్​లైన్​క్లాసులు కంటిన్యూ చేస్తున్నారు. కొవిడ్​గైడ్ లైన్స్ ప్రకారం ప్రభుత్వం సూచించిన విధంగా ఒకరోజు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి, మరొక రోజు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే ఫిజికల్ క్లాసులకు అటెండ్​ అయ్యే స్టూడెంట్స్ కి సరిగా అర్థం కావడం లేదు.  థియరీ పార్ట్ చదవడంతో 
పాటు ల్యాబ్ వర్క్ లు, ప్రాక్టికల్స్ కి అటెండ్ అయ్యేందుకు ప్రిపేర్ అవుతున్నారు. మేనేజ్ మెంట్లు కూడా టైమ్ తక్కువగా ఉండడంతో ఇంపార్టెంట్ చాప్టర్స్ తో పాటు రివిజన్లు, టెస్ట్ లు కండక్ట్ చేస్తున్నారు. 

టెన్షన్ గా ఉంది
ఆన్​లైన్​లో సిలబస్ కంప్లీట్ అయిపోయిందని రివిజన్ మొదలు పెట్టేశారు. కానీ ఎప్పుడు చెప్పారో కూడా తెలియడం లేదు. ఎగ్జామ్స్ టెన్షన్ అయితే  చాలా ఉంది. ఇంకా రికార్డ్స్ కూడా రాయలేదు.  వచ్చే నెల నుంచి ప్రాక్టికల్స్ ఉన్నాయి. -నవీన్, సీఈసీ సెకండ్ ఇయర్  

ఏం అర్థం కాలేదు
 లాక్ డౌన్ నుంచి ఆన్​లైన్​లో  క్లాసులు చెప్తున్నారు. కానీ ఏం అర్థం కాలేదు.   ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అయినా అంతా కొత్తగా అనిపిస్తుంది. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చాలా కష్టంగా ఉన్నాయి. ఎగ్జామ్స్ ఎలా రాయాలో తెలియడం లేదు. -రేణుక, ఎంపీసీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్