
- ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 889 మిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: మనదేశ ఫిన్‌టెక్ సెక్టార్‌కు నిధుల వరద కొనసాగుతోంది. మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ట్రాక్సన్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో (హెచ్1 2025) భారతీయ ఫిన్‌టెక్ రంగం 889 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. ఇది 2024 రెండవ అర్ధభాగం (హెచ్2 2024)లో సేకరించిన 1.2 బిలియన్ డాలర్లతో పోలిస్తే 26 శాతం తక్కువ.
ఒక సంవత్సరం క్రితం హెచ్1 2024లో చూసిన 936 మిలియన్ డాలర్ల నుంచి 5 శాతం పడిపోయింది. ఫిన్‌టెక్ రంగంలో నిధులు సేకరించడంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో ఉంది. కేవలం యూఎస్, యూకే మాత్రమే ముందున్నాయి. సీడ్-దశలో స్టార్టప్‌లు 91.2 మిలియన్ డాలర్లను సేకరించాయి. ప్రారంభ-దశ నిధులు 361 మిలియన్ డాలర్లకు పెరిగాయి.
చివరి-దశ నిధులు 437 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. 2025 మొదటి అర్ధభాగంలో 16 కొనుగోళ్లు జరిగాయి. ఇది హెచ్1 2024లో 11 కొనుగోళ్లు జరిగాయి.