డ్రగ్స్​ పై ఉక్కుపాదం మోపుతున్నాం..తయారు చేస్తున్న 10 కంపెనీలను సీజ్

డ్రగ్స్​ పై ఉక్కుపాదం మోపుతున్నాం..తయారు చేస్తున్న 10 కంపెనీలను సీజ్
  • డీజీపీ జితేందర్​​ వెల్లడి
  • కొడంగల్​లో పోలీస్​ స్టేషన్ల నిర్మాణానికి భూమి పూజ 

కొడంగల్, వెలుగు: రాష్ట్రంలో డ్రగ్స్​కట్టడికి ప్రభుత్వం జీరో టోలరెన్స్​విధానాన్ని అమలు చేస్తున్నదని డీజీపీ జితేందర్ తెలిపారు. కొడంగల్​లో రూ.10 కోట్లతో పోలీస్​స్టేషన్ల నిర్మాణానికి శుక్రవారం ఆయన భూమి పూజ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఇప్పటివరకు కెమికల్​డ్రగ్స్​తయారు చేస్తున్న 10 కంపెనీలను సీజ్​ చేసినట్లు తెలిపారు. 

కొడంగల్​లో పీఎస్​నిర్మాణానికి రూ. 2.96 కోట్లు, సర్కిల్ పీఎస్​కు రూ. 84.50 లక్షలు, దుద్యాలకు రూ. 3 కోట్లు, బోంరాస్​పేటకు​రూ. 2.96 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. కాంగ్రెస్​కొడంగల్ ఇన్​చార్జి తిరుపతిరెడ్డి, స్టేట్​పోలీస్​హౌజింగ్​కార్పొరేషన్​చైర్మన్​గుర్నాథ్​రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, డీఐజీ తాప్సీర్ ఇక్బాల్, పోలీస్​హౌసింగ్ ఐజీ రమేశ్ రెడ్డి, కడా స్పెషల్​ఆఫీసర్ వెంకట్​రెడ్డి ఉన్నారు.