
గండిపేట, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సుల ప్రవేశానికి కౌన్సెలింగ్ జులై 8 నుంచి 11 వరకు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాంకుల ఆధారంగా విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరు కావాలని, పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ www.pjtsau.edu.in ను సంప్రదించాలని సూచించారు.