హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం.. భార్య గొంతు కోసి పరారైన భర్త

హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం.. భార్య గొంతు కోసి పరారైన భర్త

మూడు ముళ్లు.. ఏడడుగులతో ఏకమైన కొందరు దంపతులలో ఆ బంధాన్ని జీవితాంతం కొనసాగించలేకపోతున్నారు. చిన్న చిన్న కారణాలతో ఒకరినొకరు చంపుకుంటూ వివాహ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారు. కలిసి ఉండలేకపోతే.. విడిపోయి బతకొచ్చు కదా.. చంపుకునుడు దేనికీ.. అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నప్పటికీ.. కొందరిలో ఆ అవగాహన వచ్చే పరిస్థితి లేదు. పిల్లలు, కుటుంబం, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా చంపుకుంటున్నారు. లేటెస్ట్ గా హైదరాబాద్ కుషాయిగూడలో భార్యను భర్త చంపిన ఘటన కలకలం రేపింది.

శనివారం ((సెప్టెంబర్ 20) మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుషాయిగూడలో భార్య గొంతుకోసి చంపేశాడు భర్త. కుషాయిగూడ పరిధిలోని రాధిక థియేటర్ సమీపంలో జరిగింది ఈ ఘటన. బంధువుల ఇంట్లో భార్యను హత్య చేసిన పరారయ్యాడు . 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలిని మహారాష్ట్ర ముంబై చెందిన మహిళగా గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలిస్తున్నారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.