బాధిత కుటుంబానికి మంత్రి వివేక్ పరామర్శ

బాధిత కుటుంబానికి మంత్రి వివేక్ పరామర్శ

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వికాస్​నగర్​కు చెందిన కాంగ్రెస్​ సీనియర్ లీడర్​ రావికంటి వెంకటేశ్వర్లు కుటుంబసభ్యులను బుధవారం రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ ​వెంకటస్వామి పరామర్శించారు. వెంకటేశ్వర్లు భార్య అనసూర్య మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మంత్రి ఆయన ఇంటికి చేరుకొని అనసూర్య భౌతిక కాయానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేసి ఓదార్చారు.