మెడిప్లస్‌‌‌‌‌‌‌‌ మెడికల్ షాపుల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ల తనిఖీ

మెడిప్లస్‌‌‌‌‌‌‌‌ మెడికల్ షాపుల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ల తనిఖీ

వర్ని, వెలుగు : మండల కేంద్రంలోని మెడిప్లస్ మెడికల్ షాపులో ఓఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్యాకెట్‌‌‌‌‌‌‌‌లో చెత్త రావడంతో వినియోగదారులు డ్రగ్ ఇన్​స్పెక్టర్లు శ్రీలత, శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌లకు ఫిర్యాదు చేశారు. రుద్రూర్ మండలం అక్బర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన షేక్ మహ్మద్, షేక్ మహిబూబ్‌‌‌‌‌‌‌‌ కొనుగోలు చేసిన ఓఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్యాకెట్‌‌‌‌‌‌‌‌పై అనుమానం వ్యక్తం చేయడంతో శుక్రవారం పోలీసులు సమక్షంలో మెడికల్ షాపు తాళాలు తనిఖీ చేశారు.

 మెడికల్‌‌‌‌‌‌‌‌లో నిల్వ ఉన్న మందులు, ఫుడ్ ప్రొడక్ట్స్, వినియోగదారులు చూపించిన ఓఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్యాకెట్లను పరిశీలించి నివేదికను జిల్లా అధికారులకు పంపనున్నట్లు తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని మెడిప్లస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, లైసెన్సు రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.